SRD: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురంలో బందోబస్తును ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం పరిశీలించారు. లక్షల సంఖ్యలో భక్తుల వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో సత్తయ్య గౌడ్, పట్టణ సీఐ రామునాయుడు ఉన్నారు.