HNK: ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ స్టేజీ సమీపంలో జాతీయ రహదారి పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. లారీ ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.