GNTR: జాతీయ స్థాయి సారస్ ప్రదర్శనను జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. నర్సరావుపేట రోడ్డులోని రెడ్డి కళాశాల ఎదుట ఈ ప్రదర్శన జరుగుతుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 600కు పైగా కళాకారులు పాల్గొనగా, సుమారు 250 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.