గుంటూరు జిల్లాలో 2024తో పోల్చితే 2025లో నేరాల సంఖ్య 13 శాతం తగ్గిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. సోమవారం జరిగిన వార్షిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్తులను త్వరితగతిన పట్టుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా గంజాయి సాగు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.