MDK: పౌరులు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారాన్ని పొందే హక్కు కలిగి ఉన్నారని, దీని ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతుందని డీఆర్వో భుజంగరావు తెలిపారు. మెదక్ కలెక్టరేట్లో ఆర్టీఐ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ, ప్రభుత్వ అధికారులకు చట్టంపై సంపూర్ణ అవగాహన తప్పనిసరి ఉందని ఆయన సూచించారు.