W.G: జిల్లా UTF నూతన కార్యవర్గ ఎన్నిక సోమవారం ఏకగ్రీవంగా ముగిసింది. జిల్లా అధ్యక్షుడిగా విజయరామరాజు, ప్రధాన కార్యదర్శిగా పోలిశెట్టి క్రాంతికుమార్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికై తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. నూతన కార్యవర్గంలో మొత్తం 19 మందిని వివిధ పదవులకు నియమించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.