KNR: ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ సహకారంతో రూ. 2 లక్షల వ్యయంతో నిర్మించిన వాష్ రూమ్లు కటంగూరి అంజలిదేవి, సర్పంచ్ శ్యామల, ఎంఈవో రాములు నాయక్ ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి ‘మాటా’ తరఫు నిరంతరం సహకారం ఉంటుందని సంస్థ ప్రతినిధి మనోహర్ రెడ్డి తెలిపారు. హెచ్ఎం జగదీశ్వర్, ప్రభాకర్ పాల్గొన్నారు.