NLG: చిట్యాల మండల కేంద్రంలోని లయోలా ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న అక్రమాల వల్ల విద్యార్థుల చదువు, భద్రత, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని ఏబీవీపీ చిట్యాల నాయకులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కొంపల్లి సూర్య, విద్యార్థి నాయకులు మాట్లాడారు.