E.G: రాజమండ్రిలోని CID రీజినల్ కార్యాలయం వద్ద APPDFE చట్టం & న్యాయ విధానాలపై శాఖాపరమైన శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. రాజమండ్రి CID ప్రాంతీయ అధికారి అస్మా ఫర్హీన్ పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. చిట్ ఫండ్స్, MAM కోఆపరేటివ్ సొసైటీలు వంటి సంస్థల ద్వారా జరుగుతున్న ఆర్థిక నేరాలపై దర్యాప్తు సమయంలో పాటించవలసిన విధానాలపై అవగాహన కల్పించారు.