CTR: విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని సదుం సీహెచ్సీ మెడికల్ ఆఫీసరు డాక్టరు ప్రసాద్ రాజు తెలిపారు. ఆసుపత్రిలో సోమవారం సీనియర్ ఫార్మసీ అధికారిణి సంధ్యారాణి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు. శాలువతో సన్మానించి, శేషజీవితం సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.