MDK: సింగూరు నుంచి నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలని లేకుంటే క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు వినతి పత్రం అందజేశారు. ఘనాపూర్ ఆయకట్టుకు నీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అయోమయంలో ఉన్నారన్నారు.