NLG: దామరచర్ల ఎంఈవోగా కేతావత్ సైదానాయక్ ఇవాళ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారం అనంతరం తెలుగు పాఠశాల సముదాయ భాషోపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ భాషోపాధ్యాయులు రామావత్ లాలు, గుడిపాటి కోటయ్య మాట్లాడుతూ.. సైదానాయక్ ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమని అన్నారు.