AP: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై మంత్రి రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ జిల్లా ఏర్పాటుపై తనకు ఆశ ఉందన్నారు. ‘మా ప్రజల కోరికతో రాయచోటిని మార్చకూడదని కోరుతున్నా. ప్రస్తుతం రాయచోటి ప్రజలు భావోద్వేగంతో ఉన్నారు. కొంతమంది రెచ్చగొట్టే ధోరణితోనే నాపై విమర్శలు చేస్తున్నారు. వారి లాగా నేను విమర్శలు చేయను. రాయచోటి ప్రజలకు మంచి జరగాలని కోరుతున్నా’ అని వెల్లడించారు.