HNK: విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని టీపీసీసీ ఎస్సీ వైస్ చైర్మన్ మడికొండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సంపత్ కుమార్ అన్నారు. పరకాల 1వ వార్డు CSI మిషన్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం వారు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. పేదరికానికి చదువు అడ్డు కాదని, చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, విద్యార్థులు చిన్ననాటి నుంచి కష్టపడి చదవాలని వారు అన్నారు.