NLR: సోమిరెడ్డి పాల్పడుతున్న అవినీతిని, తన హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు, రైతులు గమనిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి అన్నారు. సోమవారం ముత్తుకూరులోని కృష్ణపట్నం, బ్రహ్మదేవి గ్రామాల్లో ఆయన పర్యటించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలు అందించి అండగా నిలిస్తే సోమిరెడ్డి మాత్రం అవినీతి, అక్రమాలతో ప్రజల సొమ్ము దోచుకుంటున్నాడని కాకాణి ఆరోపించారు.