MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని పాలకేంద్రం శివారులో ఉన్న సెయింట్ పాల్స్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు కోరారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.