MNCL: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 6 వరకు జరగనున్న SGF అండర్ 19 జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు బెల్లంపల్లికి చెందిన హరిణి ఎంపికైంది. ఆమెను ఉమ్మడి ఆదిలాబాద్ కార్యదర్శి బాబురావు సోమవారం అభినందించారు. జాతీయస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచి తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.