ప్రకాశం: కొండపిలోని హైస్కూల్ గ్రౌండ్ నందు దామచర్ల సత్య యువసేన ఆధ్వర్యంలో సోమవారం నిర్వహిస్తున్న జిల్లా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గెలుపు ఓటములు సహజమేనని క్రీడాకారులు క్రీడాస్పూర్తితో ఆడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.