AP: కేబినెట్ ముగిసిన తర్వాత తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. విధిలేని పరిస్థితిలోనే రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాల్సి వచ్చిందన్నారు. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మంత్రి రాంప్రసాద్ పోరాడుతున్నారని.. ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజంపేట వాసులు కడపను కోరుకుంటున్నారని, రైల్వేకోడూరు వాసులు తిరుపతి కోరుకుంటున్నారని సీఎం వివరించారు.