MBNR:మిడ్జిల్ మండల తహశీల్దార్ యూపీ రాజుకు ఇటీవల ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా సోమవారం సమతా సైనిక్ దళ్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు మంగనూరి రాము ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సేవకుడు కొప్పుల మధు, జరుపటి రవి తదితరులు పాల్గొన్నారు.