SRPT: గాలిపటాల పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ఈ ప్రమాదకర దారంతో పక్షులు, వాహనదారులు ప్రాణాపాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విక్రయ కేంద్రాలపై నిఘా ఉంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.