‘ఈటీవీ విన్’ వేదికగా విడుదలైన ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్-1 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మేకర్స్ సీజన్-2ను కూడా సిద్ధం చేశారు. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు ‘ఈటీవీ విన్’ అధికారికంగా ప్రకటించింది. ఈ థ్రిల్లర్ సిరీస్కు ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించగా, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించింది.