యాషెస్ నాలుగో టెస్టుకు వేదికైన మెల్బోర్న్ పిచ్‌పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పిచ్‌కు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ‘అసంతృప్తికరం’ అని రేటింగ్ ఇచ్చాడు. అలాగే, ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధిస్తున్నట్లు ప్రకటించాడు. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా మారిందని, కేవలం రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడిపోయి మ్యాచ్ ముగిసిందని ఆయన తన నివేదికలో పేర్కొన్నాడు.