NGKL: ఉప్పునుంతల మండల దాసర్ల పల్లి సమీపంలోని దుందుభి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు అడిగి సోమవారం అదనపు కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా యంత్రాలు ఏర్పాటు చేసి అక్రమార్కులు ఇసుక రవాణా చేస్తున్నట్లు వారు ఫిర్యాదు చేశారు.