MDK: రామాయంపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఈ నెల 31న సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో షాజీలొద్దీన్ తెలిపారు. మండల వ్యాప్తంగా 16 గ్రామాల్లో ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల వారీగా సామాజిక తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఈ క్రమంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా దర్బార్ను 31న నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.