ADB: జిల్లాకు జాతీయ స్థాయి అవార్డులు లభించినందుకు అంగన్వాడీలు కలెక్టర్ రాజర్షి షాను కలిసి అభినందనలు తెలిపారు. టీఎన్జీవో అనుబంధ అంగన్వాడీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు మెమెంటో, పుష్పగుచ్ఛం అందించి మిఠాయి తినిపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఐసీడీఎస్ అధికారి మిల్కా, యూనియన్ అధ్యక్షురాలు రాధ, తదితరులు పాల్గొన్నారు.