కృష్ణా: చదువులో మర్మం గ్రహించే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులవుతారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం చల్లపల్లిలో 800 మంది టెన్త్ విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు విద్య మాత్రమే సాధనమని ఆయన తెలిపారు. టెన్త్ ఫలితాల్లో కృష్ణా జిల్లా ఐదో స్థానం సాధించాలని డీఈవో యూవీ సుబ్బారావుకు సూచించారు.