సత్యసాయి: మడకశిర పట్టణం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మడకశిర ఎమ్మెల్యే MS రాజు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మడకశిర పట్టణంలో గతంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిన అభివృద్ధి పనుల పురోగతి గురించి చర్చించారు. పాత విద్యుత్ స్తంభాల మార్పు, కొత్త విద్యుత్ స్తంభాల కోసం ప్రతిపాదనలు పంపాలని విద్యుత్ అధికారులకు సూచించారు.