రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. నటుడు జగపతి బాబు ఈ చిత్రంలో ‘అప్పలసూరి’ అనే కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించారు. చిత్రంలోని ఆయన పోస్టర్ను కూడా విడుదల చేశారు.