HNK: వరంగల్ నగరాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టాలని CPM జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లాలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సోమవారం CPM ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వరద బాధిత ప్రాంతాల్లో రీ-సర్వే నిర్వహించి బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.