AP: కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్లు మంత్రి వర్గం వెల్లడించింది. విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో మాత్రం మార్పులు జరిగినట్లు చెప్పారు.