NTR: ఎలమంచిలిలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదంలో విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వద్ద ఉన్న బ్యాగులో రూ.5.80 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదంలో ఈ నగదులో కొన్ని నోట్లు పాక్షికంగా కాలిపోయాయి. సోమవారం ఉదయం రైల్వే పోలీసులు ఓ సంచిలో ఈ సొమ్మంతా ప్యాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు.