భారత్ నుంచి ఒమన్‌కు ప్రయాణించడానికి ప్రత్యేకమైన నావికాదళ నౌక INSV కౌండిన్య ప్రయాణం ప్రారంభించింది. ఇది ఇంజిన్లేకుండా గాలి, తెరచాపల శక్తితో సాగుతుంది. నౌకను నిర్మించడంలో భారత పురాతన సముద్ర రహదారులను అనుసరించారు. కేరళకు చెందిన సంప్రదాయ నిపుణులు చేతితో చెక్క పలకలను తయారు చేసి నౌకను రూపొందించారు. 5వ శతాబ్దంలో భారత్‌లో ఉపయోగించిన పద్ధతుల ఆధారంగా రూపొందించబడింది.