టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లవ్ సింబల్ పోజుతో ఆకట్టుకున్న ఈ ఫొటోల్లో, ఆమె చేతిపై పెన్నుతో ఏదో రాసి ఉండటాన్ని గమనించిన ఓ అభిమాని దాని గురించి ఆరా తీశాడు. దీనికి నిధి సరదాగా స్పందిస్తూ.. ‘అయ్యో.. మళ్లీ దొరికిపోయానా?’ అంటూ రిప్లై ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఈ క్యూట్ సమాధానం ప్రస్తుతం SMలో నెటిజన్లను అలరిస్తోంది.