ATP: జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ‘అనంత పాల ధార’ పేరిట జిల్లా స్థాయి పాల దిగుబడి పోటీలు-2026 నిర్వహించనున్నారు. ఈ పోస్టర్ను కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆవిష్కరించారు. జనవరి 7 నుంచి 9 వరకు ఆకుతోటపల్లిలో ఈ పోటీలు జరుగుతాయి. సంకర జాతి ఆవులు, దేశీయ ఆవులు, గేదెల విభాగాల్లో అత్యధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల యజమానులకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు.