NRPT: ఉట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేశారు. పశువైద్యాధికారి శివప్రసాద్ మాట్లాడుతూ.. జీవాల ఆరోగ్యం కోసం పెంపకందారులు తప్పనిసరిగా మందులు వేయించాలని సూచించారు. సర్పంచ్ వాకిటి వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.