ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘AA22’. ఈ మూవీని దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ హక్కులను రూ.600 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.