TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే కేసీఆర్ కొద్దిసేపు మాత్రమే ఉండటంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యల కోసం కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని.. కేవలం తన నెల జీతం తీసుకోవడానికి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమేనని ఎద్దేవా చేశారు.