కృష్ణా జిల్లాలో రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్ బాలాజీ ప్రత్యేక చర్యలు చేపట్టారు.’రెవెన్యూ క్లినిక్’ పేరుతో కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 7 కౌంటర్లను ఏర్పాటు చేసి రెవెన్యూ దరఖాస్తుల పరిశీలన, 22A సమస్యలు, భూసేకరణ సంబంధిత సమస్యలు,పాస్ బుక్స్, రీసర్వే తదితర సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు.