SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనల అమలును పోలీసులు మరింత కఠినతరం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా, ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ మరియు లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ వెల్లడించారు.