TG: డ్రగ్స్ వినియోగించినా కూడా నేరం చేసినట్టే అని ఈగల్ ఎస్పీ సీతారాం అన్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ డ్రగ్స్ వినియోగదారుడుగా ఉన్నాడని తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న అమన్ దొరికితే ఇంకా సమాచారం తెలుస్తుందన్నారు. ఆధారాలు లభిస్తే అమన్‌ను అరెస్ట్ చేస్తామని చెప్పారు.