KRNL: సాయుధ దళాల ఫ్లాగ్ డే నిధి కోసం పట్టణ మహిళా సంఘాలు సేకరించిన రూ. 2 లక్షల చెక్కును మెప్మా పీడీ, మహిళా సంఘాల సభ్యులు కలెక్టర్ ఏ. సిరికి అందజేశారు. ఫ్లాగ్ డే నిధికి విడివిడిగా విరాలాలు అందజేయాలని కలెక్టర్ కోరారు. సాయుధ దళాల సంక్షేమానికి మహిళా సంఘాల సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ, మహిళా సంఘాలు పాల్గొన్నారు.