BDK: మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గురిజాల గోపి సోమవారం మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత రేణుకా చౌదరిని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, కార్యకర్తల సమస్యలపై చర్చించారు.