అగ్నిపర్వతాల నుంచి లావా బయటకొచ్చే సమయంలో సాధారణంగా ఎర్రగా పొంగుకొచ్చే చిత్రమే గుర్తుకొస్తుంది. అయితే, ఇండోనేషియాలోని జావా దీవిలో కావా ఈజెన్ అగ్నిపర్వతం మాత్రం నీలిరంగు లావాను చిమ్ముతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ అగ్నిపర్వతంలోని డెవిల్స్ గోల్డ్ అనే ప్రాంతంలో సల్ఫ్యూరిక్ వాయువు ఆక్సిజన్‌తో కలిసే సమయాల్లో.. రాత్రిపూట లావా నీలిరంగు మెరుపుల్లో కనువిందుగా కనిపిస్తుంది.