MBNR: జడ్చర్ల పట్టణం కల్వకుర్తి రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయాన్ని మాజీమంత్రి లక్ష్మారెడ్డి సోమవారం దర్శించుకున్నారు. మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాపడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొని అయ్యప్పస్వామి ప్రతిమకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.