ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ రిలీజ్ ట్రైలర్ ఈరోజే వచ్చేస్తోంది. నిజానికి నిన్నే రిలీజ్ కావాల్సి ఉన్నా, టెక్నికల్ కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే ఇవాళ పక్కాగా రిలీజ్ ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మారుతి డైరెక్షన్లో జనవరి 9న సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ మూవీలో.. ప్రభాస్ వింటేజ్ లుక్, హారర్ కామెడీ హైలైట్ కానున్నాయి.