SRCL: ఇంజక్షన్ వికటించి సుతారి కార్మికుడు మృతి చెందిన ఘటన తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కుకు చెందిన సుతారి కార్మికుడు మహమ్మద్ హమీద్ అనారోగ్య కారణంగా ఇంజక్షన్ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆ ఇంజక్షన్ వికటించి ఆయన మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.