AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కంటనీరు పెట్టుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుపై మండిపల్లి ఆవేదన చెందారు. ఈ సందర్భంగా మంత్రిని సీఎం ఓదార్చారు. రాయచోటికి వైద్య కళాశాల కేటాయిస్తామని, అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు.