TG: కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేయడంపై మాజీమంత్రి కేటీఆర్ స్పందించారు. ‘కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలు, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల ప్రతిఒక్కరికి ఆ గౌరవం ఉంటుంది. సీఎంకు సభలో ఉన్న సంస్కారం బయట మాటల్లోనూ ఉంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్థులు ఇలా పలకరించుకుంటే మంచిదే’ అంటూ చెప్పుకొచ్చారు.