TG: అసెంబ్లీ సమావేశానికి హాజరైన KCR పది నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ లాబీలో CM రేవంత్ చిట్‌చాట్ నిర్వహించారు. KCRను పలకరించిన సందర్భంపై స్పందించారు. ‘KCRను మర్యాదపూర్వకంగా పలకరించాను. ప్రతి సభ్యుడిని మేం గౌరవిస్తాం. ఆయనను ఇవాళే కాదు.. ఆస్పత్రిలో కూడా కలిశా. మేమిద్దం మాట్లాడుకున్నది ఎలా చెబుతాం?’ అని పేర్కొన్నారు.